24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఆర్య వైశ్య సంఘం ఎన్నికలకు రాజకీయ రంగు

Must read

📰 Generate e-Paper Clip

  • హోరా హోరీగా తలపడుతున్న రెండు గ్రూపులు
  • అనుభవం గట్టెక్కిస్తుందంటున్న ఆర్వపల్లి పురుషోత్తం
  • నవతరానికి పట్టంగడుతారంటున్న ధన్ పాల్ శ్రీనివాస్

 

నిజామాబాద్, బతుకమ్మ : కుల సంఘాల ఎన్నికల సంబురం ఇందూర్ లో రంజుగా సాగుతోంది. ఇటీవల  పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికల కోలాహలం ముగిసింది. ఇప్పుడు ఆర్యవైశ్య సంఘం ఎన్నికల హడావిడి షురువైంది. పట్టణ ఆర్యవైశ్య సంఘం  కమిటీ ఎన్నిక సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలను తలపిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా అప్పుడే ఆర్య వైశ్య సంఘం ఎన్నికలకు రాజకీయ రంగు పులుముకుంది. పట్టణ కార్యవర్గం పదవి కోసం  రెండు గ్రూప్ లు పోటీ పడుతుండగా వారు రెండు పార్టీలకు చెందిన నేతలు, రాజకీయ నేతలకు సంబందించిన వారు కావడం విశేషం. ఇందూర్ పట్టణ ఎన్నికలు బీజేపీ వర్సేస్ కాంగ్రెస్ గా మారాయి. ఒక ప్యానల్ కు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ పట్టణ, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన ఆర్వపల్లి పురుషోత్తం గుప్త బరిలో నిలిచారు. మరో ప్యానల్  తరుపున బీజేపీ మూలాలు ఉండి, ప్రస్తుత నగర శాసన సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ కు వరుసుకు సోదరుడు ఐన ధన్ పాల్ శ్రీనివాస్ పోటీపడుతున్నారు.88569

నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు కుల సంఘం కు ఎక్కువగా రాజకీయానికి ఎక్కువ అన్న చందంగా మారాయి. ఆర్య వైశ్యులు సేవా తత్పురులు. దాన గుణంలో మిన్న అనేది ఆర్యోక్తి. ఐతే ఆర్య వైశ్యులలో 20 నుంచి 40 శాతం వరకే వ్యాపార వాణిజ్యాలలో రాణిస్తున్నారు. ఐదు శాతం మాత్రమే రాజకీయాలలో ఆరి తేరిపోయారు. కొందరు ఉద్యోగాలలో, స్వయం ఉపాధితో జీవిస్తున్నారు. దాదాపు 30 శాతం వరకు కోమట్లు పేదలు ఉన్నారని వారు కుడా రోజు పని చేస్తేగాని పొట్టగడవని పరిస్థితి ఉంది.  ఐతే అట్టడుగున ఉన్న వైశ్యులు అలాంటి ఆర్య వైశ్యులలో ఉన్న అందరిని ఒకే గాటున లెక్కించడం సరికాదని, ఆర్య వైశ్యుల ఉన్నతికి రాజకీయ పార్టీల ద్వారా సంక్షేమం పొందితే పరువాలేదు గాని మొత్తానికి రాజకీయ రంగు పులుముకోవడం సరికాదని చర్చ జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న కుల సంఘం ఎన్నికలు బీజేపీ వర్సేస్ కాంగ్రెస్ మాదిరిగా జరుగుతుండటంతో ఆర్య వైశ్యుల అభ్యున్నతికి పాటుపడాల్సిన వారు పక్తు రాజకీయ పార్టీల మాదిరిగా  పోటిపడుతుండటం పై నగరంలో చర్చ జరుగుతుంది.

నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలలో పోటీపడుతున్న ఆర్వపల్లి పురుషోత్తం గుప్త గతంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా పని చేశారు. పట్టణ, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడుగా పనిచేశారు. ఆర్య వైశ్యసంఘం అభ్యున్నతికి పనిచేశారు. న్యాల్ కల్ రోడ్డులో ఉన్న కళ్యాణ మండపంకు స్థలం దాత కావడంతో ఆయన పేరుమీదనే భవనం నిర్మించారు. అంతే గాకుండా పేద ఆర్య వైశ్య  విద్యార్థులకు ఆర్థిక సహయం చేశారు. తాజాగా మరోసారి పట్టణ ఆధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఆర్వపల్లి పురుషోత్తం గుప్త తనను గెలిపిస్తే అమలు చేసే మెనిఫెస్టోతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన ప్యానల్ సభ్యులతో కలిసి పట్టణంలో సంఘం సభ్యులను కలిసి తనను గెలిపిస్తే చేసే అభివ్రుద్ధిని చేబుతు ప్రచారం చేసుకుంటున్నారు. ధన్ పాల్ శ్రీనివాస్ కుడా తనప్యానల్ తో రంగంలోకి దిగి ప్రచారం  చేస్తున్నారు. తనకు ఉన్న బందు మిత్ర వర్గం ఓట్లే అధికంగా ఉండటంతో వాటిని నమ్ముకోని ప్రచారం చేస్తున్నారు. దానికి తోడు సోదరుడి అనుచరులు అందరు గెలుపునకు పాటుపడుతారని దీమాతో ఉన్నారు. ఆర్య వైశ్య సంఘం అభ్యున్నతి సంగతి ఏమిటో గాని ఓటర్లు కుడా రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ బలపరిచిన వారిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా మాణిక్ భవన్ పాఠశాల కమిటీ, నగరేశ్వర మందిరం కమిటీ ఎన్నికలు జరగుతుండగా పట్టణ వైశ్య సంఘం కు మాత్రమే తీవ్ర పోటీ ఉంది. మొత్తానికి  ఆర్య వైశ్య సంఘం ఎన్నికలు ఈ నెల 6 వరకు రాజకీయం రంజుగా మారుతోంది అనడంలో అతిశయోక్తి లేదు.

More articles

Latest article