నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ సంబరాలలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతకమ్మని , తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) కోటేశ్వర రావ్, అదనపు డి.సి.పి ( లా అండ్ ఆర్డర్) బస్వారెడ్డి, అదనపు డి.సి.పి (ఎ.ఆర్ ) శంకర్ నాయక్, ఆర్మూడ్ రిజర్వు ఎ.సి.పి నాగయ్య, పోలీస్ కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
