30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

బంగారం చోరీ కేసులలో పోలీసులు నిర్లక్ష్యం చెయ్యొద్దు

Must read

📰 Generate e-Paper Clip

  • దుండగులను వెంటనే పట్టుకోవాలి
  • నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కరాటె రమేష్ 

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామంలో చోరికి గురైనటువంటి బాధిత కుటుంబాన్ని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కరాటే రమేష్, ముదిరాజ్ మండల కమిటీ అధ్యక్షులు మచ్చ రఘురామ్  ముదిరాజ్ లు పరామర్శించారు. అనంతరం కరాటే రమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ… మూడేడ్ల జగన్ భార్య, పిల్లలు తల్లిని వదిలీ కుటుంబాన్ని పోషించడానికి విదేశాలకు వెళ్లి రూపాయి రూపాయి కూడా పెట్టి సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్నారని అన్నారు.  బతుకమ్మ పండగ రోజే ఇలా జరగడం బాధాకరమని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. చిన్న గ్రామంలో భారీ దొంగతనం జరగడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోవాలని కోరారు. ఇందల్వాయి పోలీసులు తక్షణమే వీలైతే డాగ్ స్క్వాడ్ తో చర్యలు చేపట్టి బంగారాన్ని దొంగిలించిన దొంగలను పట్టుకోవాల్సిందిగా కోరారు. ఈ చోరీ కేసులో ఇందల్వాయి పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.

More articles

Latest article