నిజామాబాద్, బతుకమ్మ :రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలధారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సింగపూర్ పర్యటన చేస్తున్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న సీయం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తో కలిసి శనివారం జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గోన్నారు.

తెలంగాణ కల్చరల్ సోసైటి అద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, కాంగ్రెస్ నేత డాక్టర్ రోహిన్ రెడ్డిలుసింగపూర్ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అడిటోరియంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ లో సంధడి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్చరల్ సొసైటీ(సింగపూర్) అధ్యక్షుడు గడప రమేశ్ బాబు సొసైటీ కార్యవర్గంతో పాటు ,తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు.
