బాన్సువాడ, బతుకమ్మ : రైతులు సొసైటీల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ గ్రామీణ మండలం బుడిమి గ్రామంలో రూ. 26.50 లక్షలతో నిర్మించిన బుడిమి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోదాంను పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు గురువారం ప్రారంభించారు. ఈకార్యక్రమంలో బుడ్మి సొసైటీ అధ్యక్షులు గంగుల గంగారాం, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

