బతుకమ్మ బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ వీరాంజనేయ హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే పోచారం, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు గోవింద్ శర్మ ఆధ్వర్యంలో గ్రామస్థులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో హన్మాండ్లు, ప్రవీణ్ రెడ్డి, నారాయణ రెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
