బతుకమ్మ, ఏర్గట్ల: మండలంలోని భవితా సెంటర్ లో ఫిజియోథెరపీ వైద్య శిబిరం బుధవారం రోజున నిర్వహించారు.ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఫిజియోథెరపీ వైద్యురాలు స్నేహిత, చికిత్సలు నిర్వహించారు. పిల్లలకు ఉదయం సాయంత్రం ఇంట్లో వ్యాయామం చేయించాలని సూచించారు.ఇట్టి సౌకర్యాన్ని ఇంకా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఇలాంటి క్యాంపులను వినియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆనందరావు, ఉపాధ్యాయుడు ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.