26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శిగా  పీజీ హెచ్ఎంను నియమించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శిగా సీనియర్ ప్రభుత్వ  పీజీ హెచ్ఎంను నియమించాలని  పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ఈమేరకు డీఈవో అశోక్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా  కృపాల్ సింగ్ సోడి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం లో బి సీతయ్య కార్యదర్శిగా కొనసాగారు. ఆసమయంలో మూడు సార్లు డీసీఈ బీ పేపర్లు లీక్ అవడంతో  నిశాంత్ అనే క్లర్క్ సస్పెన్షన్ చేశారని పేర్కొన్నారు.  డీసీఈబీ లో మెంబర్షిప్ ఉన్నవారినే ఉమ్మడి పరీక్షలు విభాగంలో కార్యదర్శిగా ఎన్నుకుంటారన్నారు. సీతయ్య మళ్లీ కొనసాగుటకు దరఖాస్తు చేసుకున్నారని తెలిసిందన్నారు.  నిబంధనల ప్రకారం ఎనిమిది కిలోమీటర్ల లోపు సీనియర్ ప్రభుత్వ పీజీ హెడ్మాస్టర్ అర్హుడన్నారు. అందులో ఉమ్మడి పరీక్ష విభాగంలో సభ్యుడై ఉండాలి.  నిబంధనలు ఉల్లంఘించకుండా సీనియార్టీ ప్రాతిపదికన ఉమ్మడి పరీక్ష విభాగంలో నూతన కార్యదర్శిని  నియమించాలని డీఈవోను కోరారు.

More articles

Latest article