సిల్వర్ జూబ్లీ సభకు అనుమతి నిరాకరణ .. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్‌

0 1,267

ఈనెల 17న నిర్ణయం వెల్లడించాలని ఆదేశం

వరంగల్ పోలీసులకు నోటీసులు జారీ

హైదరాబాద్‌, బతుకమ్మ : హనుమకొండలో బీఆర్ఎస్‌ సిల్వర్ జూబ్లీ సభపై విచారణను ఈనెల 17కు హైకోర్టు వాయిదా వేసింది. ఈవిషయమై వరంగల్ పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. సభ అనుమతిపై ఈనెల 17న నిర్ణయం వెల్లడించాలని ప్రభుత్వ లాయర్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 27న హనుమకొండలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్‌ సిల్వర్ జూబ్లీ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ  హైకోర్టును ఆశ్రయించింది.

Leave A Reply

Your email address will not be published.