24 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

People should be alert

బతుకమ్మ, బాన్సువాడ: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బాన్సువాడ పట్టణంలోని పలు కాలనీల్లో సోమవారం ఆయన పర్యటించారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిదులకు సూచనలు చేశారు. ప్రజలు అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని, నదులు, వాగులు, చెరువులు, కల్వర్టులు, బ్రిడ్జిల వద్దకు వెళ్లొద్దని, విద్యుత్ స్తంభాలు, వైర్లను ముట్టుకోవద్దని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు ఉన్నారు.

More articles

Latest article