25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్
బతుకమ్మ,మోర్తాడ్:  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ఇంటిలో నుంచి బయటికి రావద్దని స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. ఎగువ ప్రాంతంలో నుంచి వస్తున్న వరద ప్రవాహం వల్ల ధర్మోరా శివారులో పెద్ద వాగు పైన నిర్మించిన చెక్ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో రాకపోకలు నిలిపి వేయడంతో సోమవారం చెక్ డ్యామ్ ను సందర్శించారు. ఈ దారి గుండ ఎవరు రావద్దని రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ అధికారులకు, ప్రజలకు ఆయన తెలిపారు. ఆయన వెంట మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి, ఎంపీవో శ్రీధర్, పంచాయితీ కార్యదర్శులు శ్రీనివాస్, లక్ష్మీ దుర్గ, అరుణ్ ,కారోబర్ సాయన్న తదితరులు ఉన్నారు.

More articles

Latest article