. అల్లరి మూకలను ఉపేక్షించొద్దు
. డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపండి
. స్కూళ్లు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించండి
. సమీక్షా సమావేశంలో సీపీ సాయి చైతన్యతో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో ఇటీవల చోటు చేసుకుంటున్న గ్యాంగ్ వార్ లతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని, అల్లరి మూకలను ఉపేక్షించొద్దని సీపీ సాయి చైతన్యకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. సీపీ సాయి చైతన్య, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, ఉన్నతాధికారులతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే స్కూళ్లు, కళాశాలల్లో అవగాహన దస్సులు నిర్వహించాలని కోరారు.
నిజామాబాద్ నగరంలో ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించాలని, సిగ్నల్ పాయింట్స్, వన్ వే రోడ్డు, పార్కింగ్ విషయాల్లో కఠినంగా వ్యవహరించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు.
రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో ఒకటైన ఇందూర్ నగర అభివృద్ధి, సుందరీకరణకు అందరం సమష్టి కృషితో ముందుకు వెళ్లాలన్నారు. అర్ధరాత్రి వరకు విచ్చలవిడిగా దుకాణాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ గత కొద్ది రోజుల నుంచి నిర్ణీత సమయానికి మూసివేయడంలో విజయం సాధించిన పోలీస్ శాఖను ఎమ్మెల్యే అభినందించారు.
సమావేశంలో ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

