27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జివియం విట్టల్

బతుకమ్మ, కామారెడ్డి : ఎలాంటి షరతులు లేకుండా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని భారతీయ విద్యార్థి మోర్చ నాయకులు అన్నారు. సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జివియం విట్టల్ మాట్లాడారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వందలాది మంది విద్యార్థులు తరలి వెళ్లి ధర్నా నిర్వహించడం జరిగింది అని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన లక్షలదిమంది విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వలన చాలామంది విద్యార్థులు చదువుకు దూరం అవ్వడం జరిగిందన్నారు. ఉన్నత విద్య కోర్సులకు వెళ్లే విద్యార్థులు కూడా ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల కళాశాలో అడ్మిషన్లు కోల్పోతున్నారు.కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల సర్టిఫికెట్లను ఇస్తున్నారన్నారు.

గత నాలుగు సంవత్సరాల నుండి ఫీజు బకాయిలు పెండింగ్లో ఉండటం వలన చిన్నచిన్న కళాశాలలు పూర్తిగా మూసివేసే వరకు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న బకాయిలను విద్యాసంస్థల యజమాన్యాలు సెటిల్ చేసుకోవాలని అనడం సిగ్గుచేటు అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఎమ్మెల్యేలను మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా ఇంచార్జ్ బుల్లెట్ చక్రవర్తి, భారతీయ యావ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, గడ్డం రవి ,బీవీఎం టౌన్ అధ్యక్షులు శివ, జిల్లా నాయకులు అజయ్,శివరాం, శ్రవణ్, అజయ్, అభిలాష్, శ్రీయేష్, సాయి చరణ్ పాల్గొన్నారు.

Pending scholarships, fee reimbursement should be released immediately

More articles

Latest article