పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జివియం విట్టల్ బతుకమ్మ, కామారెడ్డి : ఎలాంటి షరతులు లేకుండా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని భారతీయ విద్యార్థి మోర్చ నాయకులు అన్నారు. సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జివియం విట్టల్ మాట్లాడారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వందలాది మంది విద్యార్థులు...