రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని సీఐ కార్యాలయంలో శనివారం కోర్టు కానిస్టేబుల్ లతో రుద్రూర్ సీఐ కృష్ణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఐ కృష్ణ మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. అదేవిధంగా జూన్ 14వ తేదీన లోక్ అదాలత్ ఉంటుందని, ఈ లోక్ అదాలత్ లో కేసులను పరిష్కరించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో రుద్రూర్ ఎస్సై పి. సాయన్న, కోటగిరి ఎస్సై సునీల్, వర్ని ఎస్సై, కోర్టు కానిస్టేబుల్ లు పాల్గొన్నారు.