బతుకమ్మ, బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా సోమవారం వాహనాన్ని స్థానిక పాత బస్ స్టాండ్ వద్ద పట్టుకున్నట్లు బాల్కొండ ఎస్సై నరేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం వాహనంలో మొత్తం 62 సంచులు, 37.20 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బియ్యం విలువ మొత్తం రూ. 74,400 ఉంటుందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
