సిండికేట్ లో దందా చేయడం లేదని పీడీఎస్ మాఫియా దాడి

 పోలీసుల అండతో రెచ్చిపోతున్నపీడీఎస్ మాఫియా నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పీడీఎస్ మాఫియా రెచ్చిపోయింది.పోలీసులకు ప్రతినెల మామూళ్ళు ఇస్తున్నామని ధైర్యంతో పట్టపగలు దాడికి తెగబడింది. 2022 , 2023లో పీడీఎస్ దందా విషయంలో ఇద్దరు రౌడిషిటర్లు హత్యకు గురి కాగా ఒక పీడీఎస్ దందా నిర్వాహకునిపై హత్యాయత్నం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పీడీఎస్ దందాకు సహకరించే పోలీసులు ఉన్నారన్న అండతో శనివారం పీడీఎస్ మాఫియా రెచ్చిపోయింది. సిండికేట్ కు సంబంధం లేకుండా రేషన్ బియ్యం సేకరణ విక్రయాలు చేస్తున్నారని...