వెబ్ న్యూస్, బతుకమ్మ : ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ల నిర్వహణపై సినిమాటోగ్రాఫీ మంత్రి కందుల దుర్గేష్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రేక్షకులు కుటుంబంతో సహా థియేటర్లోకి రావాలంటే టికెట్లు, ఫుడ్ ధరలు అందుబాటులో ఉండాలన్నారు. వీటి ధరలపై నియంత్రణ ఉండాలన్నారు. టికెట్ల ధరల పెంపు కావాలంటే ఫిల్మ్ ఛాంబర్ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. తన సినిమాలకైనా అదే వర్తిస్తుందని స్పష్టం చేశారు. థియేటర్ల బంద్ వెనుక ఎవరున్నారో విచారణ చేపట్టాలని, ఇందులో జనసేన వాళ్లు ఉన్న ఉపేక్షించొద్దని స్పష్టంగా పేర్కొన్నారు.