- కుంకుమార్చన, ప్రత్యేక పూజలు
భీమ్ గల్, బతుకమ్మ : శ్రీవాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమ్ గల్ శ్రీ వాసవి మాత ఆలయంలో శుక్రవారం ఘనంగా పంచామృతాభిషేకాలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆలయ అర్చకులు మార్కండేయ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ తో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించి,సుహాసినిలచే కుంకుమార్చన, మంగళ హారతి కార్యక్రమంను నిర్వహించారు. అనంతరం ముత్తాయివుదలు శ్రీ వాసవి మాత జీవిత చరిత్ర పారాయణం చేశారు. తదనంతరం భక్తులకు ఆలయ ప్రాంగాణం లో సంఘం ఆధ్వర్యంలో అల్పాహర కార్యక్రమం నిర్వహించారు.ఇట్టి బృహత్తర కార్యక్రమం లో సంఘ కార్యవర్గం, సభ్యులు,మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

