బతుకమ్మ,ఏర్గట్ల: కస్తూర్బా గాంధీ పాఠశాల ను ఏర్గట్ల మండల ప్రత్యేక అధికారి ఆర్మూర్ డి ఎల్ పి ఓ శివకృష్ణ సోమవారం తనిఖీ చేశారు. మండల ఎంపీ ఓ శివ చరణ్, గ్రామపంచాయతీ కార్యదర్శి జాకీర్ హుస్సేన్ తో కలిసి పాఠశాల పరిసరాలను, తరగతి గదులను, వంటశాలను పరిశీలించారు. విద్యార్థలకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పిల్లల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ,తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ సంధ్య, ఉపాధ్యాయులు అమల, అర్చన, కళ్యాణి, అకౌంటెంట్ శాంత, ఏఎన్ఎం త్రివేణి, కేజీబీవీ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

