కామారెడ్డి, బతుకమ్మ: దేవునిపల్లి పిఎస్ నందు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ప్రత్యేక కృషి తో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కును గురువారం మల్టీ జోన్ వన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ, ఎస్పి బీ చైతన్య రెడ్డి, రూరల్ సీఐ రామన్, దేవనపల్లి ఎస్ఐ రాజు, పోలీస్ స్టేషన్ సిబ్బంది, చిన్న పిల్లలు పాల్గొన్నారు.

