27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

భిక్కనూరులో కొనసాగుతున్న బంద్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: ఇటీవల హైదరాబాదులోని ముత్యాలమ్మ దేవాలయంలో గల ముత్యాలమ్మ విగ్రహాన్ని,  హిందూ దేవాలయాలపై కొంతమంది దుండగులు దాడులు చేసి విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ సోమవారం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భిక్కనూరులో బంద్ నిర్వహించారు. భిక్కనూరు మండల కేంద్రంలో దుకాణాల,  వ్యాపార సముదాయాలు, స్కూల్స్ స్వచ్ఛందంగా శాంతియుతంగా బంద్ పాటించారు. హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ హిందూ దేవాలయాల జోలికొస్తే సహించలేమని హెచ్చరించారు. భిక్కనూరు మండలంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ongoing bandh in Bhikkanur

More articles

Latest article