24.1 C
Hyderabad
Monday, August 3, 2026

బైకు అదుపుతప్పి ఒకరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

  • ఒకరికి గాయాలు

 

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం ఎన్ హెచ్ 44 హైవేపై అదుపుతప్పి మంగళవారం ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం ఆనెం ఆనంద్(23) తన స్నేహితురాలితో నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే క్రమంలో బైక్ అదుపుతప్పి డివైడర్ కు తగలగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. స్నేహితురాలు సంజనకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

More articles

Latest article