27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జీజీ కళాశాల 6వ సెమిస్టర్ పరీక్షల్లో ఒకరు డిబార్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గిరిరాజ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) లో 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్ అన్నారు. శుక్రవారం జరిగిన పరీక్షలో 769 విద్యార్థులకు గాను 753 మంది విద్యార్థులు హాజరయ్యారని, 16 మంది గైర్హాజరయ్యారన్నారు. హాజరైన వారిలో ఒక విద్యార్థి మాస్ కాపీయింగ్ కి పాల్పడడంతో డిబార్ అయ్యాడు. అలాగే 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 1473 విద్యార్థులకు గాను 1451 మంది విద్యార్థులు హాజరయ్యారని, 22 మంది గైర్హాజరయ్యారని ప్రిన్సిపాల్ ఆచార్య పి.రామ్ మోహన్ రెడ్డి తెలిపారు.

More articles

Latest article