ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణంలో గత ఏడాది బైక్ చోరీకి పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం 8 నెలల జైలు శిక్ష విధించిందని ఎల్లారెడ్డి ఎస్ఐ తెలిపారు. గత సంవత్సరం నాగేశ్వర్ రావు హస్పిటల్ వద్ద జరిగిన బైక్ చోరీ కేసులో పెద్ధ కోడప్ గల్ మండలం బేగంపూర్ తాండాకు చెందిన చవాన్ సుభాష్ నిందితుడు. అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపగా శుక్రవారం ఎల్లారెడ్డి జెఎప్ సి మెజిస్ట్రేట్ అతనికి 8 నెలల జైలు శిక్ష విధించారని ఎస్ఐ తెలిపారు.
