28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి : డీఎస్పీ విఠల్‌ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బాన్సువాడ : బ్యాంకుల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ విఠల్‌ రెడ్డి సూచించారు. శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో బ్యాంకు మేనేజర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.వినియోగదారుల భద్రత రీత్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని, సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏటీఎంలో అవసరానికి మించి డబ్బులు ఉంచవద్దని అన్నారు. బ్యాంకులకు ఖాతాదారులు డబ్బుతో వచ్చినప్పుడు అప్రమత్తంగా ఎలా ఉండాలనే విషయాలను అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ఏటీఎం వద్ద ఏటీఎం కార్డులను ఎవరికీ ఇవ్వకుండా తామే డబ్బు విత్​డ్రా చేసుకునేవిధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.ఈ సమావేశంలో పట్టణం సీఐ అశోక్, బ్యాంకు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article