నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్ కు చెందిన శ్రీపాద్ అనే వ్యక్తి మద్యం మత్తులో న్యూసెన్స్ చేయడంతో కేసు నమోదు చేసి కోర్టులో హజరు పరిచినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. మద్యం మత్తలో కుటుంబ సభ్యులకు, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన శ్రీపాద్ కు సోమవారం సెకండ్ క్లాస్ మెజిస్ర్టేట్ నూర్జహన్ ఒక రోజు జైలు శిక్ష విధించగా జైలుకు తరలించినట్లు నాల్గవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
