29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రెండోరోజు ఘనంగా గజ్జేలమ్మ జాతర 

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్,బతుకమ్మ  : రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో బుధవారం రెండవరోజు గజ్జేలమ్మ దేవి జాతర ఉత్సవాలు కొనసాగాయి. పోతురాజుల విన్యాసాల మధ్య గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపుగా గ్రామ దేవతల వద్దకు వెళ్లి నైవేద్యాలు సమర్పించారు. గ్రామంలోని పాడి పంటలు, పిల్లాపాపలు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టేపు రాములు, మంత్రి గంగారాం, హన్మాండ్లు, ఆర్టీసీ రాములు, నాగనాథ్, భూమయ్య మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article