24.7 C
Hyderabad
Monday, August 3, 2026

అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రజా ప్రతినిధుల ఒత్తిడికి తలొగితే మీ భవిష్యత్తు నాశనం అవుతుంది

 

. . . కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి మున్సిపల్ కి చెందిన కమిషనర్, పట్టణ ప్రణాళిక, శానిటైజేషన్, ఇంజనీరింగ్, రెవెన్యూ, వాటర్ వర్క్స్ అన్ని విభాగాల అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ మున్సిపల్ లోని శానిటైజేషన్, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగం అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలకు అనుమతి ఇస్తే అధికారులపై చర్యలు తప్పవని అదే సమయంలో నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటికి తప్పక అనుమతి ఇవ్వాలని అన్నారు. అధికారులు ఎవరినైనా డబ్బులు అడిగితే క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదు చేస్తారని నా దృష్టికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. అవినీతి చేయాలనుకునే అధికారులు వేరే చోటకి బదిలీ చేసుకోవచ్చని అన్నారు. ప్రజా ప్రతినిధుల ఒత్తిడికి తలొగితే మీ భవిష్యత్తు నాశనం అవుతుందని అనవసరంగా భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని అన్నారు.

 

Officials of all departments should be accessible to the public.

More articles

Latest article