26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసిన ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

ప్రభుత్వ సలహాదారు, భోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ని నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్లబ్ నిర్వహిస్తున్న వివిధ సామాజిక, సాంస్కృతిక,  క్రీడా కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే కి వివరించారు.నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ద్వారా అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు ఉపయోగకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ, సమాజంతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో క్లబ్ పని చేస్తున్నదని కార్యవర్గ సభ్యులు తెలిపారు. క్లబ్ భవిష్యత్తు కార్యక్రమాలకు ఎమ్మెల్యే  సహకారం, మార్గనిర్దేశనం కోరారు.ఈ సమావేశంలో సుదర్శన్ రెడ్డి ఆఫీసర్స్ క్లబ్ కార్యకలాపాలను అభినందిస్తూ, అవసరమైన చోట తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.ఈ సమావేశంలో నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హందాన్  , ప్రధాన కార్యదర్శి డా జలగం తిరుపతి రావు  , జాయింట్ సెక్రటరీ శ్యాం సుందర్ రెడ్డి , కోశాధికారి సురేష్  , దేవిదాస్, భూపాల్ రెడ్డి , రాంరెడ్డి , పురన్ రెడ్డీ  ,  ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article