సిరిసిల్లలో ఘటన
వెబ్ న్యూస్, బతుకమ్మ : సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశలలో క్షుద్ర పూజ కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలలో ఈఘటన చోటు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం వేకువజామున పాఠశాల ఆవరణలో మేకపిల్లను బలి ఇచ్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఉదయం ఐదు గంటల సమయంలో పాఠశాల రికార్డు అసిస్టెంట్ వెంకటేశం గేటు తెరిచి బలి పూజ కోసం ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. ఈవిషయం బయటపడిన వెంటనే వెంకటేశం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈఘటనపై స్థానికులు డీఈవో కు ఫిర్యాదు చేశారు. డీఈవో ఆదేశాలతో ఎంఈవో రఘుపతి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
