30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

స్వాతిప్రియ తల్లిదండ్రులను పరామర్శించిన ఎన్ఎస్ యుఐ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : బాసర త్రిబుల్ ఐటిలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని స్వాతి ప్రియ తల్లిదండ్రులను బిచ్కుంద మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో మంగళవారం పరామర్శించారు. స్వాతి ప్రియ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామన్నారు. త్రిబుల్ ఐటీ లో సీటు సాధించిందంటే చాలా ప్రతిభ ఉన్న విద్యార్థి స్వాతి ప్రియ అని అర్థమైందని అలాంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్న స్వాతి ప్రియ వ్యక్తిగత కారణాలవల్ల ఆత్మహత్య చేసుకోవడం మమ్మల్ని తీవ్రంగా కలచి వేసిందని ఆయన అన్నారు.

More articles

Latest article