27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణలో మద్యం దుకాణాల లైసైన్స్ ల జారీకి నోటిఫికేషన్ విడుదల

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో మద్యం దుకాణాల లైసైన్స్ ల జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు.  2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు రెండేళ్ల కోసం లైసెన్స్‌లు జారీ చేయనున్నారు. ఈ ఏడాది నవంబర్‌తో మద్యం దుకాణాల ప్రస్తుత లైసెన్స్ గడువు ముగియనుంది. మద్యం దుకాణాల కేటాయింపులో ప్రభుత్వం  రిజర్వేషన్లు కల్పించింది.  గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఉండనున్నాయి. ఆరు శ్లాబుల ద్వారా లైసైన్స్ లు జారీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించారు. రాష్ట్రంలో 2600కుపైగా మద్యం దుకాణాలున్నాయి. పెంచిన దరఖాస్తు ఫీజుతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుంది.

More articles

Latest article