23.2 C
Hyderabad

ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

Must read

📰 Generate e-Paper Clip

వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, బతుకమ్మ : టీజీ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రానున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.  డ్రైవర్లు సహా వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఆర్టీసీ ఉద్యోగాల నోటిఫికేషన్ కొంత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. కొత్త బస్సుల కొనుగోలు అనంతరం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉందని సమాచారం.

More articles

Latest article