30.2 C
Hyderabad

కలెక్టరేట్ వద్ద నిరసనలకు అనుమతులు లేవు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ కలెక్టరేట్ వద్ద నిరసనలకు, ధర్నాలకు అనుమతి లేదని నిజామాబాద్ రూరల్ ఎస్ హెచ్ వో ఆరీఫ్ తెలిపారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ వద్ద గల ధర్నా చౌక్ ఓల్డ్ కలెక్టరేట్ లో మాత్రమే నిరసనలు, ధర్నాలు చేసుకోవాలని తెలిపారు. ఐడీవోసీ వద్ద నిరసనలు, ధర్నాలు చేసే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. నిజామాబాద్ ఏసీపీ అనుమతి తీసుకుని నిరసన కార్యక్రమాలు చేయాలని చట్టాన్ని అతిక్రమించిన వారిపై కేసులు తప్పవని చెప్పారు.

More articles

Latest article