బతుకమ్మ, వెబ్ డెస్క్
తెలంగాణ రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీల నిర్వహణా తీరుపై జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా కళాశాలల్లో వసతుల లేమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధ్యాపకుల కొరత, సరైన హాస్టల్ భవనాలు, క్లినికల్ పారామీటర్లు, ప్రయోగశాలలు, విద్యార్థులు పాఠాలు నేర్చుకునేందుకు సరిపడా మృతదేహాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలేజీల్లో గుర్తించిన లోపాలపై చర్చించేందుకు ఈనెల 18న ఢల్లీిలోని ఎన్‌ఎంసీ కార్యాలయానికి రావాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈలకు ఎన్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. వసతులు లేవని గుర్తించిన 26 మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్‌లు ఈ సమావేశానికి వర్చువల్ గా హాజరు కావాలని ఎన్‌ఎంసీ ఆదేశించింది.
