26.2 C
Hyderabad
Monday, August 3, 2026

నిజామాబాద్‌ ట్రాఫిక్‌ ఏసీపీ నారాయణ బదిలీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్‌ ట్రాఫిక్‌ ఏసీపీ నారాయణ బదిలీ అయ్యారు. డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా.. నిజామాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం నూతన ఏసీపీగా సీటీసీలో ఉన్న మస్తాన్‌ అలీకి బాధ్యతలు అప్పగించారు. ఏసీసీ నారాయణ బదిలీ అంశం నిజామాబాద్‌ కమిషనరేట్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఏసీపీ నారాయణపై పలు అవినీతి ఆరోపణలున్నాయి. దీంతో పాటు ట్రాఫిక్‌ విభాగంలో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్‌ సైతం ఏసీపీ తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విచారణ జరిపిన అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. దీంతో ఏసీపీ నారాయణను డీజీపీ కార్యాలయనికి అటాచ్‌ చేశారు.

More articles

Latest article