27.8 C
Hyderabad

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం సిబ్బంది బాధ్యతని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని జుక్కల్ ఎమ్మెల్యే శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సమయానికి విధులకు హాజరుకాని సిబ్బంది వివరాలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. హాజరు పట్టికను స్వయంగా పరిశీలించి సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అంశంపై కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రిలో వైద్య సేవలు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది సమయపాలనతో పాటు ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై మరింత కఠినంగా పర్యవేక్షణ కొనసాగిస్తామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు.

More articles

Latest article