23.7 C
Hyderabad

ఒక్కొక్కటిగా బయటపడుతున్న మున్సిపల్ రెవిన్యూ అధికారి నరేందర్ బాగోతం

Must read

📰 Generate e-Paper Clip

  • ఏకకాలం లో వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించే నరేందర్ ఇంట్లో శుక్రవారం భారీగా అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో శుక్రవారం దాడులు చేపట్టిన అధికారులు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన ఇంటి పై విస్తృత తనిఖీలు చేపట్టారు. దీంతోపాటు ఆయన వద్ద నుండి అధికారులు కీలక డాక్యుమెంట్ పత్రాలు, పెద్దమొత్తంలో నగదు, బంగారం గుర్తించినట్లు సమాచారం.

వీటి విలువ రూ.కోట్లల్లోనే ఉంటుందని తెలిసింది. వినాయక్ నగర్లోని అశోక టవర్స్ లో గల నరేందర్ ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లి, నిర్మల్ లోని బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. అయితే సదరు వ్యక్తిపై పలుమార్లు అనేక వివాదాలు ఆరోపణలు కూడా వెలువడాయి. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ యోగితా రానా మున్సిపల్ శాఖలు ఆయన చేసిన అవినీతి అక్రమాలపై తీవ్రంగా మందలించి అతనిపై వేటు వేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఆయన తీరులో మార్పు రాకపోవడం, ఆయనను మున్సిపల్ కార్యాలయం నుండి బోధన్ పురపాలక సంఘం కు బదిలీ చేసినప్పటికీ ఆయన మండివైఖరి తనను ఎవరూ అడిగేవారు బదిలీకి వెళ్లకపోవడం ఇక్కడే కొనసాగడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే గతంలోనే బోధన్ పురపాలక సంఘానికి ఆయనను ఇక్కడి మున్సిపల్ ఉన్నతాధికారులు పంపియలేదు. అనే అంశంపై కూడా విచారణ జరగనుంది.

More articles

Latest article