- పురుగుల మందు తాగిన బావకు వైద్యం అందకుండా చేసి చంపిన బావమరిది
- డెడ్ బాడీని గుట్టు చప్పుడు కాకుండా అడవిలో పారేసిన వైనం
- సిసి పుటేజీతో బట్ట బయలైన బావమరిది ఘాతుకం
సిరికొండ, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మైలారం గ్రామ శివారులోని అయిల కుంట వద్ద వెలుగు చూసిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసును గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ నెల 25న సిరికొండ పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై గుర్తు తెలియని వ్యక్తిని తీసుకువచ్చి అటవీ ప్రాంతంలో పారేసిన కేసు మిస్టరీని చేదించారు. అది అనుమానాస్పద మృతదేహం కాదని పక్కా ప్లాన్ తో వైద్యం అందకుండా చేసి చనిపోయిన వ్యక్తిని గుట్టు చప్పుడు కాకుండా అటవీ ప్రాంతంలో పారేసారని ధర్పల్లి సిఐ బిక్షపతి వెల్లడించారు. ఆదివారం ధర్పల్లి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఐ కథనం ప్రకారం.. కరీం నగర్ జిల్లా మంకమ్మతోటకు చెందిన ఖాజా మోయినుద్ధిన్ ఆర్మూర్ లో ఉంటు సెంట్రింగ్ పనులు చేస్తు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఖాజా మోయినుద్ధిన్ తన బావమరిది ఐన లాయిక్ అలియాస్ బబ్లూ వద్ధ పనిచేస్తున్నాడు. తరుచు అక్కతో గొడవ పడుతు ఉండటంతో ఖాజా మోయినుద్ధిన్ కు అతని బావమరిది బబ్లూ మధ్య గొడవలు జరుగుతున్నాయి. జూలై 23న రామన్నపేట గ్రామంలో సెంట్రింగ్ పనులు చేస్తుండగా ఖాజా మోయినుద్ధిన్ పురుగుల మందు తాగాడు. అతనిని ఆసుపత్రికి తీసుకువెలితే బతుకుతాడు అతడు చనిపోతే తన అక్క ప్రశాంతంగా ఉంటుందని అతడికి వైద్యం అందకుండా చేసి తన వద్ద పనిచేసే మరో లేబర్ జబ్బార్ తో కలిసి కుట్రకు తెరలేపారు. ఖాజా మోయినుద్ధిన్ ను ఆసుపత్రికి తీసుకువేళతున్నట్టుగా బైక్ పై కుర్చుండబెట్టుకుని మైలారం అటవీ ప్రాంతంలోని అయిల కుంట వద్ద పారేసి వచ్చారు. అక్కడ ఉన్న చెట్ల ఆకులతో కప్పి ఉంచితే ఎవ్వరికి విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఈ నెల 24న గ్రామస్థులు గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడి గురించి పోలీస్ లకు సమాచారం అందించారు. అయితే కొందరు ఇద్దరు వ్యక్తులు వ్యక్తిని బైక్ మధ్యలో తీసుకు వెలుతు కనపించారని విచారణలో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మైలారం ప్రాంతంలో సిసి కెమెరాలను పరిశీలించి ఇద్దరు వ్యక్తులు బైక్ పపై తీసుకువచ్చిన డెడ్ బాడీని గుర్తించి విచారణ ముమ్మరం చేశారు. భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో బబ్లూతో పాటు జబ్బార్ లను అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి సకాలంలోవైద్యం అందకుండా,ఆచూకీ కప్పి ఉంచాలన్న ఉద్దేశంతో చేసిన ఈ దారుణానికి బబ్లూ,అబ్దుల్ జబ్బర్ బాధ్యులని తేలగా ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్టు సిఐ తెలిపారు. కేసు చేదనలో సిరికొండ ఎస్.ఐ.రామకృష్ణ, సిబ్బందిని అభినంధించారు.
