27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జీఎస్టీ ఎగవేత కేసులో ముత్యాల సునీల్ కుమార్ అరెస్ట్ 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : 

 

బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ జీఎస్టీ పన్ను ఎగవేత కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ అఫ్ ఇంటిలిజెన్స్ అధికారులు ఆయనను ఆయనను అరెస్ట్ చేశారు. ఆరెంజ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన సునీల్ కుమార్ వినియోగధారుల వద్ద జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి కట్టలేదని, సుమారు రూ.28 కోట్ల పై చిలుకు కట్టాల్సి ఉండగా మూడు నెలల గడువు ముగిసిన కట్టకపోవడం తో అధికారులు జీఎస్టీ చట్టం 2017 ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేశారు.

More articles

Latest article