రుద్రూర్, బతుకమ్మ : ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని సీఐ కృష్ణ అన్నారు. మంగళవారం రుద్రూర్ – కోటగిరి ప్రధాన రహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహనాలను నడుపుతున్న 26 మందిపై కేసు నమోదు చేసి వారికి 5,760 రూపాయలు జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాల తనిఖీలలో రుద్రూర్ ఎస్సై సాయన్న, పోలీసు సిబ్బంది ఉన్నారు.
