27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ముస్లింల కొవ్వొత్తుల ప్రదర్శన

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : జమ్మూ కాశ్మీర్ లో పల్గహంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా శనివారం రాత్రి రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చత్రపతి శివాజీ  చౌరస్తా వద్ద ముస్లింలు పాకిస్తాన్ మురాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ కొవ్వొత్తులు వెలిగించి, పాకిస్తాన్ జెండాను దగ్ధం చేశారు. ఈ దాడిలో మరణించిన వారికీ రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాశ్మీర్ లో టూరిస్టు కోసం వెళ్లిన హిందువుల పై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు జాహుర్ సాబ్, సుభాని, ఇమ్రాన్, యునుస్, ఖాజా, ఇసాక్ ముస్లిం నాయకులు, హిందువులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article