ముంబయి, బతుకమ్మ : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తల్లి మాయే మస్క్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలిసి ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈమేరకు జాక్వెలిన్ మాయేతో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను రాసిన పుస్తకం ’ఉమెన్ మేక్స్ ఎ ప్లాన్‘ హిందీ ఎడిషన్ ను ఆవిష్కరించడానికి మాయే ముంబయి వచ్చినట్లు సమాచారం. కాగా, ఈపుస్తకంలో మాయే తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు.
