29 C
Hyderabad
Monday, August 3, 2026

మున్సిపల్ అధికారులు.. ట్రాఫిక్ పోలీసుల సమన్వయ లోపం

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రజలకు తప్పని ట్రాఫిక్ కష్టాలు

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసుల సమన్వయ లోపం వల్ల ప్రజలకు, నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. నిజామాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే పెద్ద ట్రాఫిక్ సర్కిల్ పూలాంగ్ చౌరస్తా అయితే నిత్యం ఈ రోడ్డు గుండా వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగుతాయి. అయితే తరచుగా ఈ ప్రాంతంలో సిగ్నల్ వ్యవస్థ పనిచేయకపోవడం వల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవకొండమే కాకుండా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీనిపై ట్రాఫిక్ ఏసిపి ని బతుకమ్మ వివరణ అడగగా 10 ఏళ్ల కాలం క్రితం ఏర్పాటుచేసిన ఈ సిగ్నల్ వ్యవస్థ కొన్ని కొన్ని సార్లు టెక్నికల్ సమస్య ఏర్పడి జంపింగ్ అవ్వడం జరుగుతుందని నగరంలో మొత్తం ట్రాఫిక్ సిగ్నల్ పనిచేస్తున్నాయని, జనాభా ట్రాఫిక్ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మరో 14 ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదికలు అందించామన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ పర్యవేక్షించే కాంట్రాక్టర్ వస్తున్నారని ఆయన రాగానే మున్సిపల్ కమిషనర్ తో బేటి జరిపించి సమస్యలేకుండా చూస్తామన్నారు.

More articles

Latest article