రుద్రూర్, బతుకమ్మ :
మట్టి స్నానంతో ఎలాంటి రోగాలు రాకుండా, చర్మవ్యాధులు దూరం అవుతాయని పతాంజలి రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు విశ్వనాథ్ మహాజన్ తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంలోని మహర్షి పతంజలి యజ్ఞ సహిత యోగ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం మట్టిస్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పతాంజలి రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు విశ్వనాథ్ మహాజన్ మాట్లాడుతూ హోలీ పండుగకు ముందు ప్రతి ఏడాది మట్టి స్నానం నిర్వహిస్తామని పేర్కొన్నారు. మట్టిస్నానం ద్వారా చర్మ రోగాలు, బీపీ, షుగర్ తగ్గుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటగిరి, బోధన్, పొతంగల్, రెంజల్ మండలాలతో పాటు వివిధ యోగ కేంద్రాల నుండి యోగ సాధకులు, యోగ సమితి కాసుల శ్రీనివాస్, బేజగం వెంకటేశం, విజయ్, తోట్ల గంగారాం, సాయిబాబా, యోగ శివ, కటికే రామరాజు, ప్రసాద్, మంచాల శ్రీనివాస్, పురుషోత్తం, సాయిలు, అంబం రాములు, తొర్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
