జుక్కల్, బతుకమ్మ :
జుక్కల్ మండలంలోని బస్వపూర్ గ్రామంలో బుధవారం అభివృద్ధి పనులను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులలో తాగునీటి కొరకై రెండో వార్డ్, మూడవ వార్డ్ లలో సింగల్ ఫేస్ మోటర్ ద్వారా పైప్ లైన్ చేసి నల్లలు బిగించారు. వీటితో పాటు స్మశాన వాటికను పరిశీలించి గ్రామ పంచాయతీ కార్యాలయం కి చేరుకుని ఎంపీడీవో, ఎంపీఓ గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ గ్రామంలో ఉన్న కొన్ని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనిల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి భరద్వాజ్, కారోబారి గంగారం, సిబ్బంది వీరయ్య, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.
