ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల పరిధిలోని 12 గ్రామాలకు చెందిన వార్డు సభ్యులకు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు ఆధ్వర్యంలో మొదటిరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందల్వాయి మండలంలో 2018 పంచాయతీ రాజ్ చట్ట ప్రకారంగా వార్డ్ సభ్యులకు ఉన్న విధులు, బాధ్యతల గురించి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామాలలో వార్డు సభ్యుల పాత్ర చాలా కీలకమైందని సూచించారు. తమ తమ వీధులలో ఉన్న సమస్యలను సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ల దృష్టికి తీసుకెళ్లి గ్రామసభల ద్వారా సమస్యలను పరిష్కరించడంలో చాలా కీలకమన్నారు. గ్రామాలలో తమ వీధులలో ప్రజలకు సేవ చేయడం చాలా అదృష్టమని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఈ సదస్సులో ఈ శిక్షణ సదస్సులో పంచాయతీ కార్యదర్శులు,వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.
