పీడీఎస్ యూ ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్

0 8,125

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలో బస్వా గార్డెన్ నుంచి వినాయక్ నగర్ లోని  అమరవీరుల స్తూపం వరకు  పీడీఎస్ యూ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థి నాయకులు,  విద్యార్థులతో మార్నింగ్ వాక్ నిర్వహించారు.  ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) నిర్మాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, కోటగిరి మండలం ఎత్తొండ గ్రామ వాసి జంపాలా చంద్రశేఖర్ ప్రసాద్ 50వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  పీడీఎస్ యూ తొలి తరం నాయకులు ఆకుల పాపయ్య   మాట్లాడుతూ జార్జి రెడ్డి మరణం తర్వాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారన్నారు. విద్యార్థుల సమస్య పై ప్రశ్నించే గొంతులు ఈ దేశంలో ఉండోద్దని జెసీఎస్ ప్రసాద్ ను ఎమర్జెన్సీ కాలం లో ఆనాటి ప్రభుత్వం హత్య చేసిందని అన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మరో వక్త అసిస్టెంట్ ప్రొఫెసర్ (సి) డా. పిట్ల సరిత మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమాలకు నిత్య చైతన్య స్ఫూర్తి జేసీఎస్ అన్నారు. విద్యార్థి సమస్యలే కాకుండా సమాజ మార్పు కోసం ప్రగతిశీల విద్యార్థులు ఆలోచిస్తారని,
జిల్లాలో యూనివర్సిటీ, మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కోర్సులు, సంక్షేమ హాస్టల్స్ పీడీఎస్ యూ విద్యార్థి సంఘం చేపట్టిన పోరాటంతోనే సాధించుకున్నామని గుర్తు చేశారు. జేసీఎస్ స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పూర్వ పీడీఎస్ యూ   నాయకులు భూమన్న, ఆకుల సత్యనారాయణ, వి సత్యం, బి. నర్సయ్య, రమేష్, వెంకన్న, ఎల్ బి రవి, సాయిబాబా, మల్లికార్జున్, పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్,  నగర నాయకులు మనోజ్, సాయికిరణ్, పవన్, ప్రసాద్, ముక్తా, మరియు ప్రజాసంఘాల నాయకులు శివకుమార్, భాస్కర్,  300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.