సమస్యలను పక్కదారి పట్టించేందుకు మోదీ కులం ప్రస్తావన

0 1,668

ఎంపీ అర్వింద్

కాంగ్రెస్ అభ్యర్థి చేసిన వాగ్ధానాలు అమలు చేసేది లేదు

బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి

నిజామాబాద్, బతుకమ్మ :  రానున్న ఎన్నికల్లో ఓటర్లు హిందూ రాష్ట్ర స్థాపన కోసం బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఎంపీ అర్వింద్ విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి చేసిన వాగ్ధానాలు ఎన్ని.. వాటి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఆ వాగ్ధానాలు అమలు చేసేది లేదన్నారు.  ప్రపంచాన్ని దిశా నిర్దేశం చేసే ప్రధాని మోదీ కులం గురించి రేవంత్ మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ ప్రాధాన్యతలు ఏంటి, సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రధాని మోదీ కులం ప్రస్తావన తెస్తున్నారని ఆరోపించారు.  అగ్ర వర్ణాలు, బీసీలు అందరూ బీజేపీకి ఓటు వేయాలని రేవంత్ వ్యాఖ్యల్లో అర్థం అవుతుందని స్పష్టం చేశారు. 

Leave A Reply

Your email address will not be published.